TALRadio Telugu
Episodes
Latest Episode
ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు
మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి! మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని కలిగిస్తాయి! అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమెకు కూడా అలాంటి ఆలోచనే కలిగింది. సమాజంలో తనలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది బాధితుల గురించి తెలుసుకున్నారు. కుటుంబ సహకారం లేకపోవడం, సమాజంలో చిన్నచూపు, ప్లాస్టిక్ సర్జరీపై సరైన అవగాహన లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. దీంతో అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవాలనే లక్ష్యంతో B.S.M.S. ట్రస్ట్ ద్వారా ఉచిత Reconstructive Surgeries చేయడం మొదలు పెట్టారు. మరి తన జీవితంలో ఎదురైన అనుభవాలు.. తనను ఈ సేవా ప్రయాణం వైపు ఎలా నడిపించాయి? అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవాలనే ఆలోచన ఎలా మొదలైంది? తనలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్లో మనతో పంచుకున్నారు. BSMS ఫౌండర్ నీహారి గారు! A life-changing experience can transform personal struggles into a mission to help others. After surviving severe burn injuries in a fire accident, Neehari realized the challenges faced by burn survivors, including lack of family support, social stigma, and limited awareness about reconstructive surgeries. Driven by her experiences, she founded B.S.M.S. Trust to support burn survivors by providing free reconstructive surgeries and helping them rebuild their lives with dignity and confidence. In this episode, BSMS Founder Neehari shares her personal journey, the inspiration behind her service initiative, and how she is bringing hope and support to people facing challenges similar to hers. Guest: Neehaari Mandali, founder Burn Survivor Mission Saviour Trust (BSMS Trust) Host: Adarsh Kumar #TALRadioTelugu #BSMSTrust #BurnSurvivorSupport #ReconstructiveSurgery #StoriesOfChange #InspiringJourneys #TouchALife #TALRadio
More Episodes992
తన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం! అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సాగిస్తున్న సేవా ప్రయాణం గురించి మొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఆమె వ్యక్తిగత జీవితం, సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. తక్కువ జీతం వచ్చిన రోజుల్లో కూడా నిరాడంబరంగా పని చేస్తూ, తన దగ్గర ఉన్న డబ్బును సమాజం కోసం ఖర్చు పెట్టిన అనుభవాల గురించి చెప్పారు. ఆమె సేవా ప్రయాణంలో కుటుంబం అందించిన తోడ్పాటు ఎంతో ప్రత్యేకం. మరి కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె తన సేవా కార్యక్రమాలను ఎలా కొనసాగించారు? వారి ప్రోత్సాహం ఆమె ప్రయాణానికి ఎలా బలంగా నిలిచింది? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పార్ట్ 2 ఎపిసోడ్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! For Seethamahalakshmi Garu, the greatest happiness comes not from spending on herself, but from contributing to society. In Part 2 of Antharangalu, she shares inspiring insights into her personal life, her dedication to social service, and how she continued helping others even with a limited income. She also talks about the important role her family played in supporting and encouraging her service journey. Tune in to this week's Antharangalu – Part 2 to hear her inspiring story of commitment, sacrifice, and family support! Guest: గూడూరు సీతామహాలక్ష్మి Founder & President, All India Body Organ Donors Association Host: డా|| శోభా పేరిందేవి #TALRadioTelugu #Antharangalu #Seethamahalakshmi #SocialService #InspiringStories #TouchALife #TALRadio
అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు, కొంతకాలం విజయనగరంలో చదువుకున్నారు. వేసవి సెలవులు, దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం వెళ్లేవారట. ఆ ప్రయాణాల్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఉన్న అనుబంధం, రాజమండ్రి దగ్గర్లోని రుచికరమైన ఆహార పదార్థాలు.. ఇలా తన చిన్ననాటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో మనతో పంచుకున్నారు! అంతేకాదు.. తమ్ముడితో చేసిన అల్లరి, అమ్మానాన్నలతో గడిపిన రోజులు, కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్లిన సందర్భాలు.. ఇలా తన బాల్యంలోని ఎన్నో సరదా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. గాయత్రి గారి చిన్ననాటి జ్ఞాపకాలను తెలుసుకోవడానికి ఈ వారం ‘మా ఊరు’ పాడ్‌కాస్ట్ తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! Childhood memories are always special, filled with family moments, fun journeys, and unforgettable experiences. In this week’s Maa Ooru episode, Gayathri takes us down memory lane, sharing her childhood memories of growing up in Visakhapatnam, studying in Vizianagaram, and visiting her grandmother’s home in Bhimavaram during holidays. From train journeys on the Simhadri Express and delicious food near Rajahmundry to playful moments with her younger brother and family outings, she recalls the beautiful moments that made her childhood memorable. Tune in to this nostalgic episode of Maa Ooru and relive the joy of childhood memories! Guest: Gayatri Patchmatla Lawyer Host: Usha #TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #NostalgicJourney #FamilyMemories #TeluguPodcast #TouchALife #TALRadio
పిల్లల దంతాల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చిన్నప్పటి నుంచే పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రషింగ్ అలవాట్లు నేర్పించడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పాల దంతాల సంరక్షణ, పుచ్చుపళ్ల సమస్యలు, ఆహారపు అలవాట్ల ప్రభావం.. ఇలా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల దంత సంరక్షణ గురించి, పళ్ళు ఊడిపోయినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లలకు మంచి Oral Hygiene అలవాట్లు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర... ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్లో మనతో పంచుకోనున్నారు ప్రముఖ పీడియాట్రిక్ డెంటిస్ట్ డాక్టర్ వివేక్ భార్గవ గారు. పిల్లల చిరునవ్వు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి! మిస్ అవ్వకండి! Healthy teeth play an important role in a child’s overall growth and development. From caring for milk teeth and preventing cavities to developing proper brushing habits and maintaining good oral hygiene, early dental care is essential. In this episode, renowned Pediatric Dentist Dr. Vivek Bhargava shares valuable insights on dental care for children, including children with special needs, precautions after tooth loss, and the role of parents in building healthy dental habits. Guest :Dr.Vivek Bhargava, Consultant Paedodontist Host: Adarsh Kumar #TALRadioTelugu #PediatricDentistry #ChildDentalCare #OralHygiene #HealthySmiles #ParentingTips #TouchALife #TALRadio
ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం కావడంతో నడవలేక రోడ్డుపై ఉండటం చూశారు. వెంటనే తన పనిని పక్కనపెట్టి, రిక్షా తీసుకొచ్చి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన మందులు కూడా కొనిచ్చారు. చిన్న వయసులో తాను చేసిన ఈ సహాయమే తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందట! ఇప్పుడు అదే సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు… సీతామహాలక్ష్మి గారు! ఎదుటివారికి సహాయం చేయడం అంటే కేవలం మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడమే కాదు.. మన జీవితం ముగిశాక కూడా మరొకరికి జీవితాన్ని అందించవచ్చని చెబుతున్నారు ఈ టీచర్! సావిత్రిబాయి జీవితం నుండి స్ఫూర్తి పొందిన వీరు అవయవదానం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ను స్థాపించి, ఒక ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా.. సమాజానికి ఉపయోగపడే విషయాలపై అవగాహన కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సంస్థను ప్రారంభించాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఆమె సాగిస్తున్న సేవా ప్రయాణం ఎలా ఉంది? తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్‌కాస్ట్ తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! Inspired by a childhood incident where she helped an injured elderly man, Seethamahalakshmi Garu has dedicated her life to serving society. Inspired by Savitribai Phule, she founded the All India Body Organ Donors Association to create awareness about organ donation. Along with being a teacher, she actively educates students and the public about the importance of organ donation and how one person's decision can save many lives. Discover her inspiring journey, social initiatives, and mission in this week's episode of Antharangalu Podcast. Guest: గూడూరు సీతామహాలక్ష్మి Founder & President, All India Body Organ Donors Association Host: డా|| శోభా పేరిందేవి #TALRadioTelugu #Antharangalu #OrganDonation #Seethamahalakshmi #SocialService #InspiringStories #TouchALife #TALRadio
చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు. బాల్యంలో స్నేహితులతో గడిపిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అంటూ… వాళ్ళ ఊరు పాలకొల్లు గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ వారం మా ఊరు కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు… ప్రముఖ సోషల్ వర్కర్ శశికళ గారు! వారి వీధిలో ఉన్న స్నేహితులతో కలిసి చదువుకోవడం, క్విజ్లు, డిబేట్లలో పోటీపడటం, సాయంత్రం వేళల్లో ఆటలతో సందడి చేయడం.. ఇలా ఎన్నో సరదా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా, వాళ్ళ నాన్న చేసిన బట్టల వ్యాపారం గురించి, ముంబాయి నుంచి తీసుకొచ్చే కొత్త కొత్త దుస్తుల గురించి, తన సొంత ఊరితో ఉన్న అనుబంధాల గురించి కూడా పంచుకున్నారు. తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి! English Summary: Childhood friendships and memories hold a special place in our hearts! From playing with friends in the streets to celebrating festivals and sharing joyful moments, these experiences remain unforgettable. In this week’s episode of Maa Ooru, renowned social worker Shashikala Garu takes us on a nostalgic journey through her childhood in Palakollu. She recalls studying with neighborhood friends, participating in quizzes and debates, and enjoying fun-filled evenings playing together. She also shares memories of her father’s clothing business, the fashionable outfits he brought from Mumbai, and her deep emotional connection with her hometown. Tune in to this heartwarming episode filled with childhood memories, friendships, and the beautiful bond with one’s roots. Don’t miss it! Guest: Sashikala Voora, Home Maker & Social Activist Host: Usha #TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #Palakollu #NostalgicMemories #TouchALife #TALRadio
Podcast Ratings & Comments
Podcast Ratings0
Podcast Comments0
About This Podcast
Description
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Language
Telugu
Release Schedule
Monthly
Hosted By
Touch A Life Foundation
Running Since
January 2022
Total Listening Time
393 hours
Content Rating
Clean
Other Podcasts in India
View All
Telugu Daily News
Pahayan Talks - Malayalam Podcast
Daily Panchangam (Telugu)
The India Energy Hour Presented by 101Reporters
Idhayathin Kural - A Feel Good Tamil Podcast ☺️
Podcast Sai Bajan Ganga
Sri Maha Ganapathi Puranam
Osho Hindi Podcast
Gita Swara Prastaaram - The meaning of Bhagavad Gita
SPOOKCAST - A Hindi Horror Podcast
BePositive Malayalam Podcast
Report Comment
See a comment that violates our guidelines? Let us know.